Belonkism Meaning : బిలాంకిజం అర్థం :

డేవిడ్ రోలర్ బిలాంక్ అర్ధం : రోల్ అంటే పాత్ర అని అర్ధం. రోలర్ అంటే పాత్రని పోషించేవారు అని అర్థం.బిలాంకిజం అంటే డేవిడ్ రోలర్ బిలాంక్ యొక్క ఆలోచన విధానాన్ని మరియు జ్ఞానాన్ని తెలియజేసే శాస్త్రీయమైన విజ్ఞానం – హేతుబద్ధమైన విజ్ఞానం, మరియు తత్వశాస్త్రం అని అర్ధం. మేధావులు యొక్క విజ్ఞానానికి మూలం ప్రశ్నించడంలోనే ఉన్నది. ప్రశ్నించే విజ్ఞానాన్ని శాస్త్రీయంగా తెలియజేయడమే బిలాంకిజంలో అత్యంత ప్రముఖమైన అంశం.
ప్రకృతిలో జరిగిన, జరుగుతున్న సంఘటనలని మరియు సమాజంలో జరిగిన, జరుగుతున్న సంఘటనలతో పోల్చి ఆలోచించి, అన్వేషించి, శాస్త్రీయ దృక్పథంతో లేదా హేతువాద దృక్పథంతో అర్థం చేసుకోవడమే బిలాంకిజంలో ఉన్న అత్యంత కీలకమైన అంశం.
డేవిడ్ రోలర్ బిలాంక్ యొక్క విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే జ్ఞానమే బిలాంకిజం.
బిలాంకిజం అనే తత్వశాస్త్రం అర్థం అవ్వాలంటే ముందు Truthism( సత్యవాదం) అంటే ఏమిటో తెలుసుకోవాలి.
Truthism అనేది శాస్త్రీయ దృక్పథం మరియు హేతువాద దృక్పథం పై ఆధారపడి ఉంటుంది.
శాస్త్రీయ దృక్పథానికి, హేతువాద దృక్పథంతో చాలా దగ్గిర సంబంధాలు ఉన్నాయి. అదే విధంగా హేతువాద దృక్పథానికి, శాస్త్రీయ దృక్పథంతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి.
హేతువాదం అంటే ఒక శాస్త్రీయ ఆలోచన విధానం. సక్రమమైన మానసిక వైఖరి. హేతువాదం అనే తాత్విక విధానాన్ని విశ్వసించి, అనుసరించే వారిని హేతువాదులు అంటారు. హేతువు అంటే కారణం అని అర్థం. ఏదైనా ఒక విషయాన్ని గుడ్డిగా విశ్వసించకుండా దానికి కారణాలను అన్వేషించడం లేదా ఆరా తీయడాన్ని హేతువాదం అంటారు. జ్ఞానానికి లేదా ఋజువుకు హేతువు లేదా కారణం అనేది మాత్రమే నమ్మదగిన ఆధారం అని భావించే తాత్విక ధోరణిని హేతువాదం అంటారు.
హేతువాదం అంటే ఎందుకు..? ఏమిటి..? ఎలా..? ఎప్పుడు..? అని శాస్త్రీయంగా ప్రశ్నించడం మరియు శాస్త్రీయమైన సమాధానలు తెలుసుకోవడం.
ఏ విషయమైనా ఏ సంఘటన అయినా ప్రయోగ పూర్వకంగా రుజువు అయితేనే హేతువాదులు ఒప్పుకుంటారు. శాస్త్రీయ దృక్పథానికి హేతుబద్ధ ఆలోచనలు ప్రధానం.
నీకు తెలియని జ్ఞానం గురించి నీకు తెలియాలంటే నువ్వు ఆలోచించాలి. ఆ ఆలోచనలు హేతుబద్ధం అయ్యి ఉండాలి.
Truthism అంటే నీ జ్ఞానంతో నువ్వు ఎలాంటి విషయాలని, నమ్ముతావో అవే నీకు నిజం. నువ్వు ఎలాంటి విషయాలని నమ్మాలి, ఎలాంటి విషయాలిని నమ్మకూడదు అనేది నీ జ్ఞానం పై ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణకు : దేవుడు ఉన్నాడు అని ఆస్తికులులా నువ్వు ఆలోచిస్తే, దేవుడు ఉన్నాడు అనేది నీకు నిజం అవుతాది.
( లేదా)
దేవుడు లేడు అని నాస్తికులులా నువ్వు ఆలోచిస్తే, దేవుడు లేడు అనేది నీకు నిజం అవుతాది.
నీ చుట్టూ జరిగిన, జరుగుతున్న సంఘటనల వల్ల నీకు తెలిసిన విషయాలలో ఏ విషయాలు గురించి అయితే నీ స్తోమతకీ తగ్గ నువ్వు బాగా ఆలోచించి, నిర్ణయాలు తీసుకుంటావో ఆ నిర్ణయాలే నువ్వు ఎలా ఆలోచించాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి పనులు చెయ్యాలి అనే విషయాలనీ నిర్ణయిస్తాయి. నీ ఆలోచనలు మరియు నీ నిర్ణయాలే నీ యొక్క వ్యక్తిగత జ్ఞానానికి ప్రాథమిక అంశాలు.
ప్రస్తుత సమాజంలో మంచివారు అంటే ఎవరు..? ప్రస్తుత సమాజంలో చెడ్డ వారు అంటే ఎవరు..? మానవత్వం అంటే ఏమిటి..? అనే ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు అనేవి నువ్వు తీసుకునే నిర్ణయాలు పై ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణకు : (కలిపిత కథ) భూస్వామ్య వ్యవస్థ, పెట్టుబడిదారి వ్యవస్థ, సామ్యవాద వ్యవస్థ పై సమాజంలో ఉన్న ప్రజలకి సరైన అవగాహన లేని రోజులలో రాబిన్ హుడ్ అనే ఒక్క వ్యక్తి భూస్వామ్యలు దగ్గర నుండి సంపదను అంటే డబ్బు, ఆహారం, బంగారం, వజ్రాలు లాంటి వాటిని దొంగతనం చేసి పేదవాళ్లకు పంచేవాడు. అందువల్ల ఎక్కువ భూమి ఉన్న ఉండి ఆర్థికంగా ధనవంతులుగా ఉన్న వారిలో ఎక్కువ మంది రాబిన్ హుడ్ నీ చెడ్డవాడిగా, మోసగాడిగా, దొంగగా భావించేవారు. తక్కువ భూమి ఉండి రైతులుగా, కౌలు రైతులుగా, కార్మికులుగా పనిచేస్తూ ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారిలో కొంతమందికి మాత్రం రాబిన్ హుడ్ మంచివాడు అని, సూపర్ హీరో గా భావించేవారు.
1వ వివరణ : 1) ఈ కథలో ధనవంతులు స్థానంలో మనం ఉంటే మనకు రాబిన్ హుడ్ చెద్దవాడు
అవుతాడు.
2) ఈ కథలో పేదవాళ్లు స్థానంలో మనం ఉంటే మనకు రాబిన్ హుడ్ మంచివాడు అవుతాడు.
2వ వివరణ : సమాజంలో ఉన్న ఒక వ్యక్తి చేసే పనులు నీ యొక్క ఆలోచన విధానానికి అనుకూలంగా ఉంటే ఆ వ్యక్తి నీకు మంచివారు అవుతారు.
(లేదా)
సమాజంలో ఉన్న ఒక వ్యక్తి చేసే పనులు నీ యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉంటే ఆ వ్యక్తి నీకు చెడ్డవారు ఆవుతారు.
మంచి చెడులు అనేవి నీ ఆలోచనలలోను మరియు నువ్వు తీసుకునే నిర్ణయాలులోనే ఉన్నాయి.
సమాజంలో మంచివారు చెడ్డవారు ఉన్నారు అని అనుకోవడం కన్న తెలివైన వారు తెలివి తక్కువవారు ఉన్నారు అని అనుకోవడమే ఉత్తమం.
సమాజంలో పెళ్లి అనే ఆచారం, కుటుంబ వ్యవస్థ, ఆర్ధిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, దోపిడీ వ్యవస్థ, దేశభక్తి, విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, లాంటివి ఏ విధంగా ఉండాలి అనేది సమాజంలో ఉన్న ప్రజలు మరియు రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాలు పై ఆధారపడి ఉంటుంది.
సమాజంలో ఉన్న ప్రజలు తీసుకునే నిర్ణయాలను నిర్ణయించే ప్రధానమైన 4 అంశాలు ఉన్నాయి.
అవి : 1) సమాజంలో ఉన్న ప్రజలకి ప్రకృతి సిద్ధంగా కలుగుతున్న ఆకలి మరియు కామ కోరికలు.
2) సమాజంలో ఉన్న స్త్రీలు-పురుషులు మధ్య ఉన్న లైంగిక సంబంధాలు.
3) సమాజంలో ఉన్న ప్రజలు యొక్క కుటుంబ పరిస్థితులు.
4) సమాజంలో ఉన్న ప్రజలు యొక్క ఆర్థిక స్తోమత.
ఈ సమాజంలో నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకడం కోసం నువ్వు భావవాదుగా ఉండలా లేదా భౌతికవాదుగా ఉండలా అనేది నువ్వు తీసుకునే నిర్ణయాలు పై ఆధారపడి ఉంటుంది.
జ్యోతిష్య శాస్త్రంలో ఎంత వరకు సైన్స్ ఉన్నది అనేది నువ్వు తీసుకుని నిర్ణయాలు పై ఆధారపడి ఉంటుంది.
కర్మ సిద్ధాంతం అనేది నిజామా లేక అబద్దమా మరియు కర్మ సిద్ధాంతంలో ఎంత వరుకు నిజం ఉన్నది అనేది నువ్వు తీసుకునే నిర్ణయాలుపై ఆధారపడి ఉంటుంది.
ఈ సమాజంలో నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకడం కోసం మంచి కర్మలు అంటే ఏమిటి..? మరియు చెడు కర్మలు అంటే ఏమిటీ..? అనే ప్రశ్నలకు, సమాధానాలు అనేవి నువ్వు తీసుకునే నిర్ణయాలు పై ఆధారపడి ఉంటాయి.
ఈ సమాజంలో నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకాలంటే నువ్వు ఆస్తికులులా ఉండలా లేదా నాస్తికులులా ఉండలా అనేది నువ్వు తీసుకునే నిర్ణయాలు పై ఆధారపడి ఉంటుంది.
ఈ సమాజంలో నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకాలంటే నీకు మార్క్యిజం మంచిదా లేక ఆబ్జెక్టివిజం మంచిదా అనేది నువ్వు తీసుకునే నిర్ణయాలు పై ఆధారపడి ఉంటుంది.
ఈ సమాజంలో నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకాలంటే నీకు సామ్యవాద ఆర్థిక వ్యవస్థ మంచిదా లేక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ మంచిదా అనేది నువ్వు తీసుకునే నిర్ణయాలు పై ఆధారపడి ఉంటుంది.
ప్రకృతిలో జరిగిన, జరుగుతున్న సంఘటనలని మరియు సమాజంలో జరిగిన, జరుగుతున్న సంఘటనలతో పోల్చి ఆలోచించి, అన్వేషించి, శాస్త్రీయ దృక్పథంతో లేదా హేతువాద దృక్పథంతో అర్థం చేసుకోవడమే బిలాంకిజంలో ఉన్న అత్యంత కీలకమైన అంశం.ప్రకృతిలో ఉన్న జీవులు యొక్క సంపూర్ణమైన సామాజిక అవసరాలు తీరాలంటే ఆ జీవులు చుట్టూ ఉన్న మొక్కలు – చెట్లు, పక్షులు – జంతువులు మరియు మానవులు అనే జీవులు ఆహారం కోసం మరియు కామ కోరికలు తీర్చుకోవడం కోసం పరితపించాలి.
ఈ విశ్వంలో భూమి అనే గ్రహం ఉన్నది. ఈ భూమి అనే గ్రహానికి ఇతర గ్రహాలతో ఆకర్షణీయమైన సంబంధం ఉన్నది. ఈ ఆకర్షణీయమైన సంబంధం వల్ల ఈ భూమి పై వివిధ రకాల జీవులు జన్మిస్తున్నాయి. ఈ జీవులని జంతువులు, పక్షులు, మానవులు అని పిలుచుకుంటున్నారు. ఈ జీవులలో కేవలం మానవులు మాత్రమే దేశాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రకృతిలో ఉన్న జీవులలో మానవులు మాత్రమే పెళ్లి అనే ఆచారం, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. బిలాంకిజం ప్రకారం మానవులంతా ప్రకృతిలో జీవించే జీవులే. ఈ మానవ జీవులే ఆస్తికులుగా, నాస్తికులుగా,పెట్టుబడిదారి ఆస్తికులుగా, సామ్యవాద ఆస్తికులుగా,భావవాదలుగా, భౌతికవాదలుగా, పెట్టుబడిదారి నాస్తికులుగా,సామ్యవాద నాస్తికులుగా, ఆధ్యాత్మికవేత్తలుగా, ఆధ్యాత్మిక పెట్టుబడిదారులుగా, ఆధ్యాత్మిక సామ్యవాదులుగా, శృంగారవేత్తలుగా, ప్రేమికులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, మార్క్సిస్టులుగా, కమ్యూనిస్టులుగా, ఆర్థికవేత్తలుగా, రాజకీయవేత్తలుగా, రాజకీయ నాయకులుగా, దేశభక్తులుగా, ఆర్థిక నేరస్తులుగా, వ్యభిచారులుగా, మోసగాళ్లుగా, దోపిడీదారులుగా, చెడ్డవారీగా, మంచివారిగా, విప్లవకారులుగా, ఉద్యమకారులుగా, హేతువాదులుగా,జర్నలిస్టులుగా,బిలాంకిస్టులుగా, సామాజికవేత్తలుగా,మానసికవేత్తలుగా, మానవతావాదులుగా, పేదవాళ్లుగా, ధనవంతులుగా, మధ్యతరగతి వాళ్ళుగా, తత్వవేత్తలుగా, శాస్త్రవేత్తలుగా, సృజనాత్మక వేత్తలుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, వైద్యులుగా, వ్యాపారవేత్తలుగా, కార్మికులుగా, రైతులుగా, అజ్ఞానులుగా, విజ్ఞానులుగా, చరిత్రనీ సంపాదించిన మేధావులుగా గుర్తింపు పొందుతున్నారు. > డేవిడ్ రోలర్ బిలాంక్.
నీ దృష్టిలో పక్షులుకి, జంతువులుకి మరియు మానవులుకి మధ్య గల తేడాలు ఏమిటి..?
నీ దృష్టిలో పక్షులుకి, జంతువులుకి మరియు మానవులుకి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జీవిత లక్ష్యాలు ఏమిటి ఏమిటి..?
| పక్షులు | జంతువులు | మానవులు |
నీ దృష్టిలో పక్షులు సమాజంకి, జంతువులు సమాజంకి మరియు మానవులు సమాజంకి మధ్య గల తేడాలు ఏమిటి..?

Belonkism philosophy explains about Hungry and Lust are the basic source of humans society including economic system, political system, patriotism, Desires and Goals.


5 comments